కర్పూరం, తులసి నూనెతో ఎలుకలకు చెక్ పెట్టవచ్చు. కర్పూరం, తులసి నూనెలో ముంచిన కాటన్ బాల్స్ ను ఇంట్లోని వివిధ ప్రదేశాల్లో ఉంచండి. అటువైపు ఎలుకలు కన్నెత్తి కూడా చూడవంటే నమ్మండి.
Image credits: pexels
Telugu
వెల్లుల్లి
ఉల్లిపాయ, వెల్లుల్లి వాసనను కూడా ఎలుకలు భరించలేవు. వీటిని నూరి ఎలుకలు వచ్చే చోటల్లో ఉంచితే సరిపోతుంది.
Image credits: pexels
Telugu
యూకలిప్టస్ నూనె
యూకలిప్టస్ నూనెలో కొద్దిగా నీళ్లు కలిపి ఎలుకలు తిరిగే ప్రదేశాల్లో స్ప్రే చేస్తే చాలు. ఆ వాసనకు ఎలుకలు చిరాకుపడిపోతాయి. ఆ దరిదాపుల్లోకి రావు.
Image credits: Getty
Telugu
వంటింట్లో జాగ్రత్త
వంటగదిలో ఆహార పదార్థాలు తెరిచి ఉంచితే ఎలుకలను ఆకర్షించే అవకాశం ఎక్కువ. కాబట్టి అన్ని ఆహార పదార్థాలను బిగుగా మూసిన డబ్బాల్లోనే ఉంచాలి.
Image credits: Getty
Telugu
శుభ్రత చాలా ముఖ్యం
చెత్త ఎలుకలకు ప్రధాన ఆకర్షణ. కాబట్టి వంటగదిలో చెత్త ఉంచకుండా, ప్రతిరోజూ బయటకు తీసేయడం వల్ల ఎలుకల బెడద తగ్గుతుంది.
Image credits: Getty
Telugu
అల్ట్రాసోనిక్ పరికరం
అల్ట్రాసోనిక్ పరికరాలు ఇంట్లో ఉంటే ఎలుకల బెడద ఉండదు. ఎందుకంటే వీటిి నుండి వచ్చే శబ్దం ఎలుకలకు అసహనంగా ఉంటుంది. ఇది రసాయన రహితంగా ఎలుకల బెడదను తగ్గించే సురక్షిత మార్గం.