జర్మనీ వద్ద లెపర్డ్ 2A7+ అత్యాధునిక యుద్దట్యాంకులు ఉన్నాయి. ఇందులో యాంటీ ట్యాంక్ మిస్సైల్, మైన్స్, IEDల నుండి రక్షణ ఉంది. గరిష్ట వేగం 72km/h, రేంజ్ 450km.
అమెరికా అబ్రామ్స్ M1A2 యుద్దట్యాంక్ 120mm XM256 స్మూత్‌బోర్ ఫిరంగితో వస్తుంది. తక్కువ ఎత్తులో ఎగురుతున్న విమానాలను కూడా ఇది కూల్చగలదు. గరిష్ట వేగం 67.5km/h, రేంజ్ 426km.
రష్యా T-14 అర్మాటా కొత్త తరం యుద్దట్యాంక్. దీని 125mm 2A82-1M స్మూత్‌బోర్ ఫిరంగి లేజర్ గైడెడ్ మిస్సైళ్లను ప్రయోగించగలదు. గరిష్ట వేగం 90km/h, రేంజ్ 500km.
UK ఛాలెంజర్ 3 రేజర్ వార్నింగ్, యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్‌లతో వస్తుంది. గరిష్ట వేగం 60km/h. ఇందులో L55A1 120mm స్మూత్‌బోర్ ఫిరంగి ఉంది.
K2 బ్లాక్ పాంథర్ దక్షిణ కొరియా అత్యాధునిక ట్యాంక్. ఇందులో 120mm స్మూత్‌బోర్ ఫిరంగి ఉంది. గరిష్ట వేగం 70km/h, రేంజ్ 450km.
ఇజ్రాయెల్ మెర్కావా MK.4 ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ట్యాంకుల్లో ఒకటి. దీని 120mm MG253 స్మూత్‌బోర్ ఫిరంగి వివిధ యాంటీ ట్యాంక్ మిస్సైళ్లను ప్రయోగిస్తుంది. గరిష్ట వేగం 64km/h.
జపాన్ టైప్ 10 (TK-X) నాల్గవ తరం యుద్దట్యాంక్. ఇందులో 120mm స్మూత్‌బోర్ ఫిరంగి, 12.7mm మెషిన్ గన్ ఉన్నాయి. 1,200hp ఇంజిన్ 70km/h గరిష్ట వేగాన్ని ఇస్తుంది.
లెక్లెర్క్ ఫ్రెంచ్ ట్యాంక్. ఈ మూడవ తరం యుద్దట్యాంక్ CN120-26 120mm స్మూత్‌బోర్ ఫిరంగితో వస్తుంది. ఇందులో Galix సెల్ఫ్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంది. గరిష్ట వేగం 72km/h.
రష్యా T-90MS అనేది 125mm 2A46M-5తో వస్తుంది. భారత్ దగ్గర T-90 వెర్షన్ ఉంది. ఇందులో V-92S2F 1,130hp ఇంజిన్ ఉంది. గరిష్ట వేగం 60km/h.
చైనా VT4 మూడవ తరం యుద్దట్యాంక్. దీని 125mm స్మూత్‌బోర్ ఫిరంగి వివిధ మిస్సైళ్లను ప్రయోగించగలదు. గరిష్ట వేగం 70km/h, రేంజ్ 500km.