జుట్టు పెరుగుదలను వేగవంతం చేసే వాటిలో ఉల్లిరసం కూడా ఒకటి. ఇది చుండ్రును కూడా నివారిస్తుంది.
ఒకటి లేదా రెండు ఉల్లిపాయలను తీసుకుని తొక్క తీసి శుభ్రం చేయాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలుగా కోసి మిక్సీలో వేసి రసం తీసుకోవాలి.
ఉల్లి రసాన్ని తలకు, జుట్టుకు బాగా పట్టించాలి. అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవాలి. మంచి ఫలితాలు కనిపిస్తాయి.
వారంలో రెండు, మూడు సార్లు ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గి, జుట్టు బాగా పెరుగుతుంది.
ఒక టీస్పూన్ ఉల్లిరసం, రెండు టీస్పూన్ల కొబ్బరి నూనె కలిపి తలకు, జుట్టుకు పట్టించాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.
ఉల్లిరసం, కలబంద జెల్, టీ ట్రీ ఆయిల్ కలిపి తలకు పట్టించి, 15 నిమిషాల తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి.
గుడ్డులోని తెల్లసొన, ఉల్లిరసం కలిపి తలకు పట్టించడం చుండ్రు, జుట్టు రాలడం తగ్గిస్తుంది.
Purple Cabbage: పోషక ఖజానా పర్పుల్ క్యాబేజీ.. ఇన్ని ప్రయోజనాలున్నాయా?
Healthy Bones: ఈ ఫుడ్స్ మానేయకుంటే.. మీ ఎముకలకు డేంజరే!
ఈ ఆహారాలను కలిపి అస్సలు తినొద్దు.. తింటే కోరి సమస్యలు తెచ్చుకున్నట్లే?
Iron Rich Foods: రక్తహీనతకు చెక్ పెట్టే ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవే..