Coconut Oil vs Olive Oil: జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఏ నూనె మంచిది?
health-life Jun 18 2025
Author: Rajesh K Image Credits:pinterest
Telugu
కొబ్బరి నూనె
కొబ్బరి నూనె జుట్టు పెరుగుదల ఉపయోగకరం. ఇది జుట్టులో బాగా ఇంకిపోయి, చిట్లకుండా చేస్తుంది, అలాగే తలకు తేమను అందిస్తుంది. చుండ్రు, దురదను తగ్గిస్తుంది.
Image credits: Freepik
Telugu
ఈ సమస్యలకు చెక్
కొబ్బరి నూనె జుట్టును బలపరిచి, జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే, చుండ్రు సమస్యను నయం చేస్తుంది. కొబ్బరినూనెను క్రమంగా వాడితే.. కొద్ది రోజుల్లోనే జుట్టు రాలడం తగ్గించవచ్చు.
Image credits: Freepik
Telugu
కొబ్బరి నూనె ఎలా వాడాలి?
మీ జుట్టు చాలా పొడిగా, నిర్జీవంగా లేదా చివర్లలో చిట్లి ఉంటే, కొబ్బరి నూనె రాసి మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచండి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
Image credits: Freepik
Telugu
ఆలివ్ నూనె ప్రయోజనాలు
ఆలివ్ నూనె జుట్టుకు తేమను చేకూర్చడంలో, పొడిబారిన జుట్టును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విటమిన్ E , ఇతర పోషకాలు జుట్టును ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తాయి.
Image credits: Getty
Telugu
ఈ సమస్యలకు పరిష్కారం
ఆలివ్ ఆయిల్ జుట్టు రాలడానికి కారణమయ్యే డైహైడ్రోటెస్టోస్టెరాన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. అలాగే.. ఒలిక్ యాసిడ్ ఆల్ఫా రిడక్టేజ్‌ను నిరోధించి, హెయిర్ ఫాల్‌ను కంట్రోల్ చేస్తుంది.
Image credits: freepik
Telugu
ఏది బెస్ట్?
కొబ్బరి నూనె, ఆలివ్ నూనె రెండూ పొడి, బలహీనమైన జుట్టుకి మంచివే. మీ జుట్టు రకానికి తగ్గట్టుగా వీటిలో ఏదో ఒకటి వాడండి.