భారత్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ పరిస్థితి దిగజారింది. IMF నుండి చైనా, సౌదీ అరేబియా, UAE వరకు అన్ని దేశాల నుండి అప్పులు చేసింది. ఇప్పుడు మళ్ళీ మిత్రదేశాల నుండి అప్పులు అడుగుతోంది.

india Pakistan War: భారత్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ మళ్ళీ అప్పులు అడుగుతోంది. ఒకవైపు IMF నుండి మరో బెయిలౌట్ ప్యాకేజీ కోసం ఎదురు చూస్తుంటే, మరోవైపు మిత్రదేశాలను ఆశ్రయిస్తోంది. శత్రువులు దేశానికి చాలా నష్టం కలిగించారు... దయచేసి ఆర్థికసాయం చేయాంటూ పాకిస్థాన్ అడుక్కుంటోంది. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు స్వయంగా పాకిస్థాన్ ఆర్థిక వ్యవహారాల విభాగమే సోషల్ మీడియా వేదికన ఆర్థిక సాయం కోరుతున్నట్లు ప్రకటించింది. తర్వాత నాలుక కరుచుకుని తమ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయ్యిందంటూ ప్రకటించింది.

Scroll to load tweet…

కేవలం IMF నుండే కాదు చైనా, సౌదీ, యూఏఈ వంటి దేశాలను పాక్ అప్పులు అడిగింది. ఈ క్రమంలో ఇప్పటికే పాకిస్థాన్ కు ఎంత అప్పు ఉంది? ఏ దేశం నుండి ఎంత అప్పు చేసింది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్ పరిస్థితిని తెలుసుకుందాం...

పాకిస్థాన్ పై ఎంత అప్పు ఉంది

జూన్ 2024 నాటికి పాకిస్థాన్ ప్రభుత్వ నివేదిక ప్రకారం, దేశంపై మొత్తం 256 బిలియన్ డాలర్లు (సుమారు 21.6 లక్షల కోట్ల రూపాయలు) అప్పు ఉంది, ఇది దేశ GDPలో 67%. పాకిస్థాన్ పై 7.3 లక్షల కోట్ల విదేశీ అప్పు (ఇతర దేశాలు, అంతర్జాతీయ బ్యాంకులు లేదా IMF నుండి) మరియు 14.3 లక్షల కోట్ల దేశీయ అప్పు ఉంది. ఈ లెక్కన పాకిస్థాన్ లో పుట్టే ప్రతి బిడ్డపై 86.5 వేల రూపాయల అప్పు ఉంటుంది.

పాకిస్థాన్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు

స్టాటిస్టిక్ టైమ్స్ ప్రకారం, పాకిస్థాన్ వద్ద విదేశీ మారక ద్రవ్య నిల్వలు కేవలం 1.3 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి. విదేశీ అప్పు డాలర్లలో ఉంటుంది. దీన్ని చెల్లించడానికి విదేశీ కరెన్సీ (డాలర్) అవసరం.

ఏ దేశం నుండి ఎంత అప్పు చేసింది

  • 'ది వరల్డ్ బ్యాంక్ ఇంటర్నేషనల్ డెట్ రిపోర్ట్ 2024' ప్రకారం, డిసెంబర్ 2024 నాటికి పాకిస్థాన్ పై చైనాకు 28.7 బిలియన్ డాలర్లు (సుమారు 2.42 లక్షల కోట్లు) అప్పు ఉంది.
  • డిసెంబర్ 2024 నాటికి సౌదీ అరేబియా పాకిస్థాన్ కు 9.16 బిలియన్ డాలర్లు (సుమారు 77.2 వేల కోట్లు) ఇచ్చింది.
  • 2019లో పాకిస్థాన్ 3 బిలియన్ డాలర్ల నగదు డిపాజిట్ తీసుకుంది, దీన్ని ప్రతి సంవత్సరం పునరుద్ధరిస్తోంది.
  • డిసెంబర్ 2024 నాటికి IMF పాకిస్థాన్ కు 7.5 బిలియన్ డాలర్లు (సుమారు 64 వేల కోట్లు) అప్పు ఇచ్చింది.
  • 1958 నుండి 2024 వరకు IMF నుండి పాకిస్థాన్ 25 సార్లు 15 బిలియన్ డాలర్లకు పైగా అప్పు తీసుకుంది.
  • పాకిస్థాన్ పై UAE మరియు ఖతార్ కూడా భారీగా అప్పు ఇచ్చాయి.