పాకిస్తాన్ మిస్సైల్ దాడి తర్వాత భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. లాహోర్, సియాల్‌కోట్, ఇస్లామాబాద్‌లలో వ్యూహాత్మక స్థావరాలపై దాడులు,  F-16 కూల్చివేత, నౌకాదళం బలప్రదర్శన – ఇలా ఆపరేషన్ గురించి 10 కీలక విషయాలు.

India Pakistan War 2025: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. గతకొన్ని గంటల్లో పాకిస్తాన్ జరిపిన మిస్సైల్, డ్రోన్ దాడులకు భారత్ దీటుగా బదులిచ్చింది. భారత వైమానిక దళం పాకిస్తాన్ దాడులను అడ్డుకోవడమే కాకుండా లాహోర్, సియాల్‌కోట్, ఇస్లామాబాద్‌లలోని వ్యూహాత్మక స్థావరాలను ధ్వంసం చేసింది. భారత భూభాగంలో చొరబడి దాాడులకు యత్నించిన పాకిస్ధాన్ యుద్దవిమానాలు కుప్పకూలాయి... ఒక F-16 సహా ఐదు పాకిస్తానీ విమానాలు కూలిపోయాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో ఇప్పటివరకు చోటుచేసుకున్న టాప్ 10 పరిణామాలివే. 

1. అరేబియా సముద్రంలో భారత నౌకాదళం దాడులు

పాకిస్తాన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత నౌకాదళం అరేబియా సముద్రంలో దాడులు చేపట్టింది. ఇది భారత్ సమన్వయ సైనిక వ్యూహంలో భాగం. ముఖ్యంగా ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీ పోర్ట్ ను ధ్వంసం చేసింది.

2. జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌లలో సైనిక స్థావరాలపై దాడులు

డ్రోన్లు, మిస్సైళ్లతో పాకిస్తాన్ సరిహద్దు దాటి దాడులు చేసింది...జమ్మూ, పఠాన్ కోట్, ఉదంపూర్ లోని సైనిక స్థావరాలను టార్గెట్ గా చేసుకుంది. కారీ భారత రక్షణ వ్యవస్థ వాటిని తిప్పికొట్టింది. దీంతో ఎలాంటి నష్టం జరగలేదు.

3. భారత మిస్సైల్‌తో F-16 కూల్చివేత

సర్గోధా వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన పాకిస్తాన్ F-16ను భారత్ కూల్చివేసింది. ఇది భారత ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే మిస్సైల్ వ్యవస్థ సామర్థ్యానికి నిదర్శనం.

4. సరిహద్దు రాష్ట్రాల్లో బ్లాక్‌అవుట్

జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లలోని సరిహద్దు ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రజలను కూడా అప్రమత్తం చేసి ఇళ్ళలోనే ఉండాలని సూచించారు. భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయి.

5. పఠాన్‌కోట్‌పై భారీ కాల్పులు, హై అలర్ట్

జమ్మూ ప్రాంతంలోకి చొరబాటుదారుల ప్రవేశ ద్వారమైన పఠాన్‌కోట్‌పై పాకిస్తాన్ భారీ కాల్పులు జరిపింది. భారత సైన్యం ప్రతిఘటించింది.

6. ఐపీఎల్ మ్యాచ్ రద్దు, ధర్మశాల స్టేడియం ఖాళీ

భద్రతా కారణాల దృష్ట్యా ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను రద్దు చేశారు. బ్లాకవుట్ కారణంగా స్టేడియంలోని ప్లడ్ లైట్స్ ను కట్టేయాల్సి వచ్చింది. దీంతో మ్యాచ్ ను రద్దు చేసి ప్రేక్షకులను బయటకు పంపి స్టేడియంను మూసివేశారు.

7. విమానాశ్రయాలు, విమానాల భద్రత కట్టుదిట్టం

విమానాశ్రయాల్లో అప్రమత్తతను పెంచారు. ఎయిర్ మార్షల్‌ల సంఖ్యను పెంచి, ప్రయాణికులను రెండుసార్లు తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికులు నిర్ణీత సమయంకంటే మూడుగంటల ముందుగా ఎయిర్ పోర్ట్ కు రావాలని సూచించారు. 

8. భారత్ వ్యూహం 

ఉద్రిక్తతను పెంచడం కాదు, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా భారత్ దాడులు చేసిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. పీఓకే, పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంది.

9. 15 భారతీయ నగరాలపై పాకిస్తాన్ దాడి విఫలం

శ్రీనగర్, అమృత్‌సర్, చండీగఢ్ వంటి నగరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడికి యత్నించగా, భారత మిస్సైల్ రక్షణ వ్యవస్థ వాటిని అడ్డుకుంది.

10. అమెరికా ప్రకటన: భారత్‌కు మద్దతు, కానీ యుద్ధం నుంచి దూరం

భారత్ ఆత్మరక్షణ చర్యలకు అమెరికా మద్దతు ప్రకటించింది. కానీ ఈ యుద్ధంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని భారత్-పాక్ తేల్చుకోవాలని సూచించింది,

ఇకపై ప్రతి దాడికీ దీటుగానే బదులిస్తాం: భారత్

పాకిస్తాన్ దాడులకు ఇకపై సంయమనం పాటించబోమని, దీటుగా బదులిస్తామని భారత్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజంలో సానుభూతి కోసం ప్రయత్నిస్తుంటే, తాము శాంతి కాంక్షిస్తామని... ఇది తమ బలహీనత కాదని భారత్ ప్రపంచానికి చాటి చెబుతోంది.