పాకిస్తాన్ ప్రయోగించిన 'ఫతేహ్-1' క్షిపణిని భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టం గాల్లోనే ధ్వంసం చేసింది. చైనా సహాయంతో తయారు చేయబడిన ఈ గైడెడ్ రాకెట్ క్షిపణిని భారత సైనిక స్థావరాలపై దాడి చేసే ఉద్దేశ్యంతో ప్రయోగించారు.  

India Pakistan War : ఇండియా-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ఇరుదేశాలు క్షిపణులు, డ్రోన్ దాడులు, ప్రతిదాడులకు దిగుతున్నాయి. అయితే పాక్ దాాడులను సమర్ధవతంగా ఎదుర్కోవడంలో భారత్ ముందుంది. పాక్ మిస్సైల్స్, డ్రోన్స్ ను ఆకాశంలోనే పిట్టల్ని కాల్చినట్లు కాల్చేస్తున్నారు. దీంతో భారత్ ను దెబ్బతీయాలన్న కుట్రలు పారడంలేదు.

చివరకు పాకిస్తాన్ అత్యంత శక్తివంతమైనదిగా చెబుతున్న ఫతేహ్-1 క్షిపణిని కూడా భారత్ తుస్సుమనిపించింది. దీన్ని భారత్ వైపు ప్రయోగించిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ క్షిపణిని గుర్తుతెలియని ప్రదేశం నుండి ప్రయోగించారు... కానీ భారత అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థ దానిని గాల్లోనే ధ్వంసం చేసింది. దీని తర్వాత జమ్మూతో సహా పలు ప్రాంతాలపై పాకిస్తాన్ డ్రోన్ దాడులకు ప్రయత్నించింది... కానీ వాటిని కూడా భారత్ నాశనం చేసిందని సమాచారం.

తుస్సుమన్న పాక్ ఫతేహ్ ... చైనా సరుకు మరి

ఫతేహ్-1 సాధారణ రాకెట్ కాదు. ఇది పాకిస్తాన్ యొక్క గైడెడ్ MLRS, ఇది భూమి నుండి భూమికి ఖచ్చితమైన దాడులు చేయగలదు. దీని పరిధి 140 కిలోమీటర్లు, అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం కూడా ఉంది. పాకిస్తాన్ దీన్ని చైనా సహాయంతో అభివృద్ధి చేసింది, కానీ భారతదేశ సన్నద్ధత ముందు ఈ 'చైనా ఆయుధం' ధ్వంసమైంది. ఒకప్పుడు గేమ్ ఛేంజర్ అనుకున్న క్షిపణి ఇప్పుడు గాల్లో బూడిదైపోయింది.

భారతదేశ 'సర్జికల్ ఎయిర్ షీల్డ్' 

భారతదేశం ఇచ్చిన ప్రతిస్పందన మన రక్షణ వ్యవస్థ ఎంత బలమైనదో చూపిస్తుంది. బరాక్-8 క్షిపణితో ఫతేహ్-1ని ధ్వంసం చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. S-400, ఆకాశ్, స్పైడర్ వంటి వ్యవస్థలు కూడా యాక్టివ్ మోడ్‌లో ఉన్నాయి. అంటే పాకిస్తాన్ ప్రయోగించే ఏ క్షిపణినైనా భారతదేశంలోకి ప్రవేశించకముందే నాశనం చేయబడుతుంది.

రాకెట్ ప్రయోగించకముందే భారత్ అప్రమత్తం

ఇస్రో ఉపగ్రహాలు, RAW/NTRO సహాయంతో భారతదేశం చాలా కాలంగా పాకిస్తాన్ MLRS కదలికలను గమనిస్తోంది. ఫతేహ్-1 ప్రయోగించగానే భారతదేశం దాని స్థానం, దిశను గుర్తించి ఖచ్చితమైన ప్రతిదాడి చేసింది.

 పతేహ్ ఇంత బలహీనమా..!

  1. ఈ క్షిపణి గురించి పాకిస్తాన్ పెద్ద పెద్ద మాటలు చెప్పింది, కానీ ఇప్పుడు దాని నిజస్వరూపం బయటపడింది. శబ్దం ఎక్కువ, ప్రభావం తక్కువ.
  2. ఇది స్థిర లక్ష్యాలపై మాత్రమే పనిచేస్తుంది.
  3. భారతదేశ అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థ ముందు దీనికి ఏ మాయలు పనిచేయవు.
  4. దీని లాజిస్టిక్స్ ఖర్చుతో కూడుకున్నది.
  5. దీని ఖచ్చితత్వం కూడా నమ్మదగినది కాదు.

భారత ఆయుద సంపత్తి

భారతదేశం వద్ద ప్రళయ్, పినాక, బ్రహ్మోస్ వంటి ఆయుధాలు ఉన్నాయి, ఇవి ఫతేహ్-1 వంటి వ్యవస్థలను ప్రయోగించకముందే ధ్వంసం చేయగలవు. పాకిస్తాన్ మళ్ళీ రెచ్చగొడితే, ప్రతిస్పందన రక్షణాత్మకంగా మాత్రమే కాకుండా నిర్ణయాత్మకంగా కూడా ఉంటుంది.