- Home
- Entertainment
- డైరెక్టర్ భుజంపై తల వాల్చి సమంత సెల్ఫీ..ఇద్దరి డేటింగ్ రూమర్స్ పై రాజ్ నిడిమోరు భార్య సంచలన పోస్ట్ ?
డైరెక్టర్ భుజంపై తల వాల్చి సమంత సెల్ఫీ..ఇద్దరి డేటింగ్ రూమర్స్ పై రాజ్ నిడిమోరు భార్య సంచలన పోస్ట్ ?
ప్రఖ్యాత దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru) సతీమణి ష్యామలీ డే (Shhyamali De) ఒక భావోద్వేగపూరిత నోట్‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు.

Samantha, Raj Nidimoru, Shhyamali De
ప్రఖ్యాత దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru) సతీమణి శ్యామలీ డే (Shhyamali De) ఒక భావోద్వేగపూరిత నోట్‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు. రాజ్, నటి సమంత రూత్ ప్రభు మధ్య డేటింగ్ రూమర్స్ ప్రచారమవుతున్న నేపథ్యంలో శ్యామలీ డే ఈ పోస్ట్ చేయడం ఆసక్తిగా మారింది. శ్యామలీ డే రాజ్ నిడిమోరుకి సతీమణి. పదేళ్ల క్రితమే వీరు పెళ్లి చేసుకున్నారు.
Samantha
శ్యామలీ డే తన నోట్‌లో ఇలా రాసారు: "నా గురించి ఆలోచించే వారికి, నన్ను చూసే వారికి, నా గురించి వినేవారికి, నాతో మాట్లాడేవారికి, నా గురించి మాట్లాడేవారికి, నన్ను చదివేవారికి, నా గురించి రాసేవారికి, నన్ను కలిసేవారికి ప్రేమతో, ఆశీర్వాదాలతో నా ప్రేమను పంపుతున్నాను."
Samantha
ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇదే రోజు సమంత తన తొలి నిర్మాణ ప్రాజెక్ట్ అయిన ‘శుభం’ గురించి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఫొటోలు పంచుకున్నారు. ఈ ఫొటోలలో ఒకటి ప్రత్యేకంగా సోషల్ మీడియాలో దృష్టిని ఆకర్షించింది. ఆ ఫొటోలో సమంత, రాజ్ నిరిమోరుతో కలిసి విమానంలో కూర్చొని, ఆయన భుజంపై తల వాల్చి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోటోకు సమంత క్యాప్షన్ పెట్టింది:"మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. #SUBHAM తో మొదటి అడుగు వేశాం. ఇది హృదయం, కొత్త కథలపై నమ్మకంతో నడిచే ప్రయాణం."
Samantha
రాజ్ నిడిమోరు ప్రముఖ డైరెక్టర్ డ్యూయో రాజ్ అండ్ డీకే లో భాగం. ఆయన గత 10 సంవత్సరాలుగా శ్యామలీ డేతో వైవాహిక బంధంలో ఉన్నారు. శ్యామలీ ఒక సైకాలజీ గ్రాడ్యుయేట్. ఆమె రాకేష్ ఓంఖ్యాన్ష్ మెహ్రా, విశాల్ భారద్వాజ్ వంటి దర్శకులతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. దంపతులకు ఒక కుమార్తె ఉంది.
Samantha
ఇదిలా ఉండగా, రాజ్, సమంత తమ మధ్య ఉన్న సంబంధాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. ఇటీవలే వీరిద్దరూ కలసి తిరుపతి దేవస్థానాన్ని దర్శించినట్లు కూడా సోషల్ మీడియాలో ఫోటోలు బయటకొచ్చాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో శ్యామలీ డే షేర్ చేసిన నోట్‌కు ప్రాధాన్యం ఏర్పడింది.